: సాయిశ్రీ మృతదేహంతో బొండా ఉమ ఇంటి వద్ద నిరసన


కేన్సర్ బారిన పడి తండ్రికి తన దీనావస్థను తెలియజేస్తూ, చికిత్సకయ్యే డబ్బు ఇవ్వాలని కోరి, ఆపై మరణించిన సాయిశ్రీ అంత్యక్రియల సందర్భంగా విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. సాయిశ్రీని అంత్యక్రియలకు తరలిస్తున్న వేళ, వందలాది మంది వెంటరాగా, ఆమె బంధువులు బొండా ఉమ ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఆయన ఇంటి వద్ద డప్పు కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సాయిశ్రీ తండ్రి బొండా ఉమకు కుడిభుజమని, ఆయన అండ చూసుకునే సాయిశ్రీ పేరిట ఉన్న ఇంటిని కొట్టేయాలని చూసి, కుమార్తెకు వైద్యం చేయిస్తే, ఎక్కడ తిరిగి బతుకుతుందో అన్న ఆలోచనతోనే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపించారు. మొత్తం విషయం ఉమకు తెలిసినా, అనుచరుడికే వత్తాసు పలికి ఓ చిన్నారి ప్రాణాలను తీశారని దుమ్మెత్తి పోశారు. బొండా ఉమ ఇంటివద్ద బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేలా సాయిశ్రీ బంధువులకు నచ్చజెప్పి పంపారు. ఈ ఘటనపై బొండా ఉమ స్పందించాల్సివుంది.

  • Loading...

More Telugu News