: ఇండియాతో తలపడితే ఓటమేనని పాక్ కు బాగా తెలుసు: జావదేకర్


ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే, తాము గెలవలేమన్న సంగతి పాకిస్థాన్ కు బాగా తెలుసునని, అందుకే కాశ్మీర్ సమస్యను అడ్డుపెట్టుకుని దొంగ యుద్ధం చేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో ఉగ్రవాదులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, సైనికులపై దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. "ఇండియాను ఓడించలేమని పాకిస్థాన్ కు తెలుసు. యుద్ధం వస్తే మరో ఆప్షన్ కూడా లేదని తెలుసు. యుద్ధంలో గెలవలేమని తెలుసుకునే, వారు కుతంత్రాలు పన్నుతున్నారు. వాటిని కూడా నిలువరిస్తాం. అంతర్జాతీయ వేదికపై పాక్ ను ఏకాకిని చేస్తాం" అని ఆయన అన్నారు.

పుల్వామా జిల్లాలో నిన్న భారత జవాన్లు ప్రయాణిస్తున్న వాహన సముదాయంపై దాడి ఘటనను జావదేకర్ ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై జాతి యావత్తూ నమ్మకాన్ని ఉంచిందని అన్నారు. యూరీ దాడిని తామెన్నటికీ మరువమని, 18 మంది జవాన్ల బలిదానాన్ని వృథా కానివ్వబోమని అన్నారు.

  • Loading...

More Telugu News