: అమెరికాలో సిస్కో అధినేత జాన్ ఛాంబర్ నాతో 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటో చూపించారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో క్లౌడ్ మేనేజ్ మెంట్, సైబర్ సెక్యూరిటీపై దృష్టిసారించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ... క్లౌడ్ మేనేజ్ మెంట్‌లో సహకారానికి న్యూటనిక్స్ ముందుకు వచ్చిందని చెప్పారు. మనం నాలెడ్జ్‌తో సంపద సృష్టించాలని ఆయన అన్నారు. తన అమెరికా పర్యటనలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు.
అమెరికాలో సిస్కో అధినేత జాన్ ఛాంబర్ తనతో 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఫొటోను చూపించారని చంద్రబాబు అన్నారు. తాను అమెరికా పర్యటనలో గూగుల్ ఎక్స్, యాపిల్, టెస్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సిస్కో సంస్థలతో సమావేశమయ్యానని తెలిపారు. తాము వ్యవసాయంలో వ్యూహాలను మార్చి హార్టీకల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టి సారించామని తెలిపారు. రెయిన్ గన్స్, నదుల అనుసంధానం, మొబైల్ లిఫ్టులు వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెదర్లాండ్ యూనివర్సిటీ సహకారం కూడా తీసుకుంటున్నామని అన్నారు.