: చైనా ఆశలపై నీళ్లు చల్లిన భారత్!


డ్రాగన్ దేశం చైనా ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. చైనా రాజధాని బీజింగ్ లో జరిగే 'వన్ బెల్ట్, వన్ రోడ్' సదస్సును బహిష్కరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సదస్సుకు మన దేశం తరపున ప్రతినిధులు హాజరుకావడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. రైలు, రోడ్డు, సముద్ర మార్గం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దులను అనుసంధానం చేయడమే ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమ లక్ష్యం. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్న చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే చైనా ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తమ భూభాగమని... దాన్ని పాక్ లో చేర్చడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో వన్ బెల్ట్ వన్ రోడ్ సదస్సుకు భారత్ దూరమవుతోంది. అసలే అంతంత మాత్రం ఉండే భారత్-చైనా సంబంధాలు ఇటీవల మరింత దిగజారాయి. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి చైనా మద్దతివ్వకపోవడం, అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటనను చైనా వ్యతిరేకించడం తదితర అంశాలు కూడా ఈ సదస్సుపై ప్రభావం చూపాయి. 

  • Loading...

More Telugu News