: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మోసపోయానని తెలుసుకొని ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది!


ఆ అబ్బాయి, అమ్మాయి పేర్లు ఈరన‍్న, ఆర్తి.. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న ప‌రిచ‌యం ప్రేమగా మారింది. పెద్ద‌లు వ‌ద్దంటారేమోన‌ని, ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా పెళ్లి చేసుకున్నారు. సెప‌రేటుగా రూం తీసుకొని కొన్నాళ్లు ఎంతో సంతోషంగా గ‌డిపారు. ఆ త‌రువాత ఆ అమ్మాయికి తెలిసింది.. త‌న ప్రియుడి అస‌లు స్వ‌రూపం. ఇన్నాళ్లూ ఆ అమ్మాయితో జ‌ల్సా చేసిన ఆ యువ‌కుడు తాము ఉంటున్న ఇంట్లోనే ఆర్తిని వ‌దిలేసి పారిపోయాడు. త‌న ప్రియుడు వ‌స్తాడేమోన‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసిన ఆ యువ‌తి చివ‌ర‌కు మోస‌పోయాన‌ని తెలుసుకుంది.

దిక్కుతోచ‌ని స్థితిలో ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితికి వ‌చ్చేసిన ఆ యువ‌తి.. త‌న‌కు న్యాయం చేయాలంటూ ఇప్పుడు త‌న భ‌ర్త ఇంటి ముందు ఆందోళ‌న‌కు దిగింది. ఈ ఘ‌ట‌న‌ కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రాంతంలో చోటు చేసుకుంది. మంత్రాలయంలోని ఈరన‍్న ఇంటి ముందు ఈ రోజు ఉదయం ఆమె బైఠాయించి, నిర‌స‌న తెలుపుతోంది. దీంతో ఈరన‍్న కుటుంబసభ‍్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు.

  • Loading...

More Telugu News