: పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయుల మృతి


పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న నౌషెరా సెక్టార్ లోని రాజౌరి వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం 7.15 గంటల నుంచి తేలికపాటి ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో పాక్ సైనికులు కాల్పులకు తెగించారు. పాక్ సైనికుల దాడులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు గ్రామాల్లోని పలువురు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.  

  • Loading...

More Telugu News