: ఓదారుస్తున్నా వెక్కి వెక్కి ఏడ్చిన కపిల్ మిశ్రా... వీడియో చూడండి
ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఆయన అనుచరులు ఓదార్చుతున్నా వెక్కివెక్కి ఏడ్చిన ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఐదుగురు మంత్రుల విదేశీ ఖర్చుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కపిల్ మిశ్రా నిరాహారదీక్ష చేపట్టారు. అయితే అవినీతి ఆరోపణలు చేస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన కపిల్ మిశ్రా డిమాండ్ కు ఆ పార్టీ నుంచి సమాధానం అందలేదు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కపిల్ మిశ్రా... రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ కాసేపు మౌనంగా కూర్చుని, కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పొంగుకొస్తున్న దుఃఖంతో వెక్కి వెక్కి ఏడ్చారు.