: ఆ మెసేజింగ్ యాప్ లో ఇకపై మీ సెల్ఫీనే చాటింగ్ స్టిక్కర్‌గా సెట్ చేసుకోవచ్చు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘గూగుల్ అల్లో’ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే తమ మెసేజింగ్ యాప్‌లలో ఎన్నో సరికొత్త సౌకర్యాలు తీసుకొచ్చిన వాట్సప్, హైక్ లాంటి వాటిల్లో కూడా ప్రవేశించబెట్టని కొత్త ఫీచర్‌ను గూగుల్ అల్లో తీసుకొచ్చింది.
యువతలో ఉన్న సెల్ఫీ క్రేజుని దృష్టిలో ఉంచుకొని గూగుల్ అల్లో యాప్‌లో స్టిక్కర్ ప్యాక్ అనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అది ఆన్ చేసి సెల్ఫీ తీసుకుని దాని ద్వారా స్టిక్కర్ ప్యాక్‌ను సొంతంగా రూపొందించుకోవచ్చు. ఇందులో సుమారు 560 రకాల కాంబినేషన్లు ఉపయోగించి కొత్త తరహా స్టిక్కర్లను తయారు చేయొచ్చని, ఆ స్టిక్కర్లన్నీ సెల్ఫీ దిగిన ఫొటోకి అతి దగ్గరగా ఉంటాయని గూగుల్ అల్లో తెలిపింది. ఆ స్టిక్కర్స్‌లో తమ యూజర్లకు ఏదైనా నచ్చకపోతే వాటిని ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పింది.