: క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా: జస్టిస్ కర్ణన్‌


కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని కర్ణన్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు విన్నవిస్తూ ఓ అభ్యర్థన పత్రాన్ని న్యాయస్థానానికి అందజేయగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కర్ణన్ అరెస్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉన్న సమయంలో ఆ పిటిషన్ ను విచారిస్తామని కోర్టు వెల్లడించింది. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన కర్ణన్ పై కోర్టు ధిక్కార కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News