: కార్లు కొనాలని అనుకుంటున్నారా? డ్రాలో గెలిస్తేనే ఛాన్స్: కీలక నిర్ణయం తీసుకోనున్న మోదీ సర్కారు!


ఇంధన వ్యయాలను అదుపులో ఉంచుకుంటూ, 2030 నాటికి 60 బిలియన్ డాలర్లను పొదుపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్, డీజిల్ కార్లకు పరిమితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రతిపాదించగా, దీనికి మోదీ సర్కారు ఆమోదం పలకనున్నట్టు తెలుస్తోంది.

'ఇండియా ట్రాన్స్ ఫర్మేటివ్ మొబిలిటీ సొల్యుషన్స్' పేరిట ఈ నివేదిక విడుదల కాగా, పెట్రోల్ లేదా డీజిల్ కార్లు కొనాలని భావించే వారికి లాటరీ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాలని ఈ నివేదికలో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ లేదా షేర్డ్ వాహనాల శాతాన్ని పెంచేందుకు సబ్సిడీలను, నగదు ప్రోత్సాహకాలను అందించడానికి ఏర్పాట్లు చేయాలని కూడా నీతి ఆయోగ్ సూచించింది. 'న్యూ గ్రీన్ కార్ పాలసీ ఇన్ ఇండియా బేసిస్' తో నివేదిక తయారైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News