: కంట్రీక్లబ్ లోని పబ్ యజమానికి జైలు శిక్ష


హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో ఉన్న లిస్బాన్ పబ్ యజమాని మురళీకృష్ణకు రెండు రోజుల జైలు శిక్ష పడింది. సమయపాలన లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా పబ్ ను నిర్వహిస్తున్నందుకు ఈయనకు కోర్టు శిక్ష విధించింది. ఇప్పటికే ఈ పబ్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక కేసుకు సంబంధించి నాంపల్లిలోని న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మురళికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. సమయపాలన పాటించని హోటళ్లు, పబ్ లకు ఈ తీర్పు గుణపాఠమని చెప్పింది. 

  • Loading...

More Telugu News