: 20 కోట్ల వాటాలను అమ్మకానికి పెడితే, 1,622 కోట్లకు డిమాండ్... హడ్కో ఐపీఓ సూపర్ సక్సెస్!


ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటాల విక్రయం విజయవంతం అయింది. అమ్మకానికి ఉంచిన వాటాలతో పోలిస్తే 79.49 రెట్ల అధిక డిమాండ్ ఏర్పడింది. మొత్తం రూ. 1,224 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా 20,40,58,747 వాటాలను అమ్మకానికి ఉంచగా, 16,22,12,70,600 వాటాలకు సమానమైన మొత్తాన్ని ఇన్వెస్టర్లు బిడ్ల రూపంలో దాఖలు చేశారు. క్యూఐబీ (క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్) విభాగంలో 55.45 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 330 రెట్లు అధికంగా సబ్ స్క్రయిబ్స్ వచ్చాయని ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో ఉంచిన వాటాలకు 10.60 రెట్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ నమోదైంది. కాగా, రూ. 56 నుంచి రూ. 60 మధ్య ఈక్విటీ ప్రైస్ బ్యాండ్ ఉండగా, గరిష్ఠ మొత్తమైన రూ. 60 మీదనే నిధుల సమీకరణను హడ్కో విజయవంతంగా పూర్తి చేసింది. ఐడీబీఐ క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, నోమురా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉండగా, వాటాల విక్రయం తరువాత ఈక్విటీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టింగ్ కానున్నాయి.

  • Loading...

More Telugu News