: అవుటర్ రింగు రోడ్డుపై డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన కారు...ఇద్దరు స్పాట్ డెడ్


రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తుక్కుగూడ సమీపంలోని అవుటర్ రింగు రోడ్డుపై అత్యంత వేగంగా వెళ్లిన వెర్నా కారు డివైడర్ ను ఢీ కొట్టి సినిమాలోని దృశ్యాల తరహాలో రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో కార్లో వున్న ఇద్దరు వ్యక్తులు బయటకు విసిరేయబడి.. రోడ్డుకు రాసుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, వారిని అరుణ్ కుమార్, సాయిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కారు మొత్తం రక్తసిక్తంగా మారడంతో ఈ ప్రమాద చిత్రాలు గగుర్పొడిచేలా ఉన్నాయి.

  • Loading...

More Telugu News