: రైల్వే జోన్ వస్తుందా?.. నేడు విశాఖకు వస్తున్న రైల్వో బోర్డ్ ఛైర్మన్
ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్. ఎన్నో దశాబ్దాలుగా రైల్వే జోన్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైల్వే జోన్ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, రైల్వే బోర్డు ఛైర్మన్ ఏకే మిట్టల్ నేడు విశాఖపట్నానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండబోతున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీలు, డివిజన్ అధికారులు, కార్మిక సంఘాల నేతలలో ఆయన భేటీ కానున్నారు. మిట్టల్ రాక ఉత్తరాంధ్ర వాసుల్లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు కోసమే ఆయన విశాఖకు వస్తున్నారంటూ ఊహాగానాలు చేస్తున్నారు.