: ఏపీలో కొత్త ఆనకట్టపై ఏమంటారు?: యాజమాన్య బోర్డుకు కేంద్రం ప్రశ్న
ముఖ్యమంత్రి ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలవనరుల శాఖ నుంచి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు అందాయి. ఈ బ్యారేజ్ కొత్తగా ప్రతిపాదించినది కనుక బోర్డుతో పాటు అత్యున్నత నిర్ణయాక మండలిలో సైతం చర్చ జరగాల్సి వుందని, అప్పుడే ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తాయని జల వనరుల రంగం నిపుణులు వ్యాఖ్యానించారు.
అనుమతులు ఇస్తే, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించవచ్చా? లేక రాష్ట్ర ప్రాజెక్టుగానే భావించాలా? అన్న విషయంపై యాజమాన్య బోర్డు, జలవనరుల శాఖ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. ఇక ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభిప్రాయాన్ని కూడా బోర్డు కోరే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, అభ్యంతరాలేంటన్న విషయమై తెలంగాణను వివరణ కోరవచ్చని తెలుస్తోంది.