: ఏపీ అసెంబ్లీ నుంచి 53 మంది తెలంగాణ ఉద్యోగుల రిలీవ్.. కోడెలకు కృతజ్ఞతలు


ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం తెలంగాణ స్థానికత కలిగిన 53 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. అనంతరం వారు వెలగపూడి నుంచి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సహకరించిన ఏపీ శాసనసభాధిపతి కోడెల శివప్రసాదరావుకు ఈ సందర్భంగా ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ శాసనసభ నుంచి రిలీవ్ అయిన వారిలో పదిమంది అసిస్టెంట్  సెక్షన్ ఆఫీసర్లు, ఒక  అసిస్టెంట్ సెక్రటరీ కాగా, మిగిలిన వారు నాలుగో తరగతి ఉద్యోగులు. ఏపీ శాసనసభ నుంచి మరో 37 మంది ఇంకా రిలీవ్ కావాల్సి ఉందని వారు తెలిపారు. ఇక తెలంగాణకు పయనమైన ఉద్యోగులకు ఏపీ అసెంబ్లీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతికి చిహ్నమైన బుద్ధుడి బొమ్మను కానుకగా అందించారు.

  • Loading...

More Telugu News