: ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు!
ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. మరో ఐదు రోజుల్లో.. 15వ తేదీ నాటికే అండమాన్ తీరాన్ని రుతు పవనాలు తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం పలు సంకేతాల ద్వారా తెలుస్తోందన్నారు. రుతుపవనాల ప్రవేశానికి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో వాతావరణ అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.