: ‘బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్...లవ్యూ పవన్ కల్యాణ్’ అంటున్న హరీష్ శంకర్!
ఐదేళ్ల క్రితం విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఓ రేంజ్ లో హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విశేషాలను దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా గుర్తుచేసుకున్నారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్లు చేసిన హరీష్ శంకర్, ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఐదేళ్ల తర్వాత కూడా ఈ చిత్రానికి సంబంధించిన మెమొరీస్ సజీవంగా ఉన్న భావన కల్గుతోంది. లవ్యూ.. పవన్ కల్యాణ్’ అని అన్నారు. ‘బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్...జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు’ అని మరో ట్వీట్ లో హరీష్ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు.