: అద్భుతమైన ఆఫర్లతో తిరిగి లాంచ్ చేసిన ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2’
మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2 స్మార్ట్ ఫోన్ ను అద్భుతమైన ఆఫర్లతో తిరిగి లాంచ్ చేశారు. యూజర్లకు ఏడాది పాటు 4జీ ఉచిత డేటాతో పాటు ఏ నెట్ వర్క్ కైనా ఉచితంగా కాల్ చేసుకునే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సర్వీసు ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్ ని కొనుగోలు చేసే వినియోగదారులకు ఎయిర్ టెల్ 4జీ సిమ్ తో కలిపి డివైస్ ని అందిస్తోంది. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నెనల్ స్టోరేజ్, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ వెనుక కెమెరా,3050 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాడ్ కోర్ 1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్ మొదలైనవి ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ పై ఏడాది పాటు స్క్రీన్ రిప్లేస్ మెంట్ ఆఫర్ వర్తిస్తుంది.