: ఈ రోజు సాయంత్రం నిషిత్ మిత్రుడు రవిచంద్ర అంత్యక్రియలు
కారు ప్రమాదంలో నిషిత్ తో పాటు మృతి చెందిన అతని మిత్రుడు రవిచంద్ర అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నారు. రవిచంద్ర స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రవిచంద్ర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రవిచంద్ర కుటుంబసభ్యులను పరామర్శించారు.