: నేడు కింగ్స్ ఎలెవన్ ఓడిపోతే... ప్లే ఆఫ్ లెక్కలన్నీ తేలినట్టే!


ఐపీఎల్ పదో దశలో తొలి రౌండ్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓడిపోతే, ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవేంటన్నది తేలిపోతుంది. మిగతా మ్యాచ్ ల ఫలితాలు టాప్-4లో నిలిచిన ముంబై, కోల్ కతా, పుణె, హైదరాబాద్ జట్లను ప్రభావితం చేసేవి కాకపోవడంతో ఈ నాలుగు జట్లే ప్లే ఆఫ్ కు వెళతాయి.

ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే మాత్రం సన్ రైజర్స్ ముందు  చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఒకటి ఉంటుంది. శనివారం నాడు గుజరాత్ లయన్స్ తో కాన్పూర్ లో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి. గెలిస్తే ప్లే ఆఫ్ స్థానం ఖరారవుతుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోతే ఆదివారం నాడు పుణె జట్టుతో పంజాబ్ ఆడే మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఆ మ్యాచ్ లో పుణె గెలిస్తే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ లో ఉంటుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిస్తే మాత్రం (నేడు కూడా గెలిచి) హైదరాబాద్ జట్టు ఇంటిదారి పట్టినట్టే. ఇక మిగతా మ్యాచ్ లన్నీ నామమాత్రమే. అయితే, ఈ మ్యాచ్ లతో టాప్-4 జట్ల స్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News