: మంత్రి నారాయణకు ఫోన్ చేసిన వైఎస్ జగన్
ఘోర రహదారి ప్రమాదంలో కొడుకును దూరం చేసుకున్న ఏపీ మంత్రి నారాయణను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ ఉదయం నారాయణకు ఫోన్ చేసిన జగన్, తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, జరిగిన విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిషిత్ అంత్యక్రియలు ముగిసిన తరువాత జగన్ ఫోన్ చేసి ఓదార్చినట్టు తెలుస్తోంది. కాగా, నిషిత్ అంత్యక్రియలకు హాజరైన పలువురు మంత్రులు, తిరిగి తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు. గంటా శ్రీనివాస్ తదితర కొద్దిమంది మంత్రులు మాత్రం నెల్లూరులోనే నేడు ఉంటారని తెలుస్తోంది.