: తెలంగాణ భూ సేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
భూ సేకరణ చట్టానికి సవరణలు తెస్తూ, తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం పలికారు. ఈ బిల్లును కేంద్ర క్యాబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. ఇక రాష్ట్రపతి కూడా సంతకం చేయడంతో, రేపు గెజిట్ లో ప్రచురించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం సమయంలో సస్పెన్షన్ కు గురైన తెలుగుదేశం సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించకపోగా, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకించినా, కేసీఆర్ సర్కారు మూజువాణి ఓటుతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో బిల్లు పాసైపోయినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.