: ముగిసిన నిషిత్ అంత్యక్రియలు... రవిచంద్ర విషయంలో వీడని సందిగ్ధత!
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు ముగిశాయి. అయితే నిషిత్ తో పాటే కారులో ప్రయాణిస్తూ మృత్యువాత పడిన అతని స్నేహితుడు రాజా రవిచంద్ర అంత్యక్రియల విషయంలో మాత్రం సందిగ్ధత వీడలేదు. రవిచంద్ర అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయమై సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నిన్ననే మృతదేహం టంగుటూరుకు చేరుకున్నప్పటికీ, రవిచంద్ర సోదరి, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న లేఖ రావడం ఆలస్యమైంది. లేఖ రాక కోసం వేచి చూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఆమెకు కడసారి చూపును అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఆమె వచ్చిన తరువాతనే అంతిమ సంస్కారం జరుపుతామని వెల్లడించారు. కాగా, ఆమె ఎప్పటికి చేరుకుంటారు? అమెరికా నుంచి బయలుదేరారా? లేదా? అన్న విషయమై సమాచారం తెలియరాలేదు.