: నా విజయం వెనుక పవన్ కల్యాణ్ పాత్ర ఉంది: టీడీపీ నేత మోదుగుల
2014లో తన విజయం వెనుక పవన్ కల్యాణ్ పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి రావడం వెనుక పవన్ కృషి కూడా ఉందని, పవన్ ను వాడుకుని వదిలేశామన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీ మధ్య దూరం పెరగడం మంచిది కాదని, దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం ఉండకూదనే ఉద్దేశంతోనే పవన్ ఆ ట్వీట్లు చేశారని అన్నారు.