: ప్రధానికి జగన్ ఎందుకు షరతు పెట్టలేదు?: మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పి ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎందుకు షరతు పెట్టలేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని కాళ్లు జగన్ పట్టుకున్నారని, బీజేపీ ముస్లింలకు అన్యాయం చేస్తోందన్న జగన్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ కూడా జగన్ తో పొత్తు పెట్టుకోదని అన్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నిన్న చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.