: హోంశాఖతో నా లింకులు నాకున్నాయి.. అందుకే ఆ విషయం తెలుసుకోగలిగా: దిగ్విజయ్


తెలంగాణ పోలీసు శాఖపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నందువల్లే తాను ఆ విషయాలను బయటకు చెప్పానని అన్నారు. హోంశాఖలోని అధికారులలో తనకు కావాల్సిన వారు ఉన్నారని... వారి ద్వారానే తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని తెలిపారు. ఒక ఫేక్ ఐసిస్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి, మైనారిటీ యువతను ఆకర్షించి, ఆ తర్వాత వారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయిస్తున్నారంటూ దిగ్విజయ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News