: ఓఆర్ఆర్ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు


రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడ్డారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీల్లో భాగంగా రెండు వాహనాలను పోలీసులు ఆపగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నారని, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News