: ప్రభాస్ ను తక్కువ చేస్తూ కామెంట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు
బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ తో సినిమాలు తీయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి మాత్రం ప్రభాస్ పై పెదవి విరిచాడు. బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ క్రెడిట్ ఏమాత్రం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా విజయానికి కేవలం కథ, దర్శకత్వం మాత్రమే కారణమని ఆయన తెగేసి చెప్పాడు. ఇందులో నటించిన నటీనటులందరూ సినిమా ఘన విజయం సాధించడానికి కొంత వరకు ఉపయోగపడ్డారే తప్ప... ఇంకేం లేదని అన్నాడు. అయితే, అవకాశం వస్తే మాత్రం ప్రభాస్ హీరోగా సినిమా తీస్తానని చెప్పాడం కొసమెరుపు.