: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్: 'ఫిదా' మోషన్ పోస్టర్ లో అభిమానులను అలరిస్తున్న అందాలబొమ్మ.. మీరూ చూడండి!
మలయాళ 'ప్రేమమ్' సినిమాలో మలర్ గా అభిమానుల మనసులు దోచుకున్న యువ అందం సాయి పల్లవి పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఫిదా' మోషన్ పోస్టర్ ను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో సాయిపల్లవి ఆకట్టుకుంటోంది. తుంపర్ల వర్షంలో ఇంటి మండువాలో ఊయలను పట్టుకుని నిల్చున్న భంగిమతో అందర్నీ మరోసారి ప్రేమలో పడేసింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా, వరుణ్ తేజ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోపక్క సాయి పల్లవి, నాని సరసన 'ఎంసీఏ' సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, భూమిక ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.