: యోగి విన్నపం.. వెంటనే స్పందించిన మోదీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో వేగం పెంచారు. ఒక్క దెబ్బతో 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి సంచలనం రేకెత్తించారు. ఇదే సమయంలో, పాలనను ఉరుకులు పెట్టించడానికి తనకు మరికొంత మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కావాలంటూ ప్రధాని మోదీకి యోగి విన్నవించారు. రాష్ట్రంలో సీనియర్ అధికారుల కొరత ఉందని, మరో 10 మంది సీనియర్లను యూపీకి పంపాలని ప్రధానిని కోరారు. దీంతో, ప్రస్తుతానికి ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లను యూపీకి పంపించారు మోదీ. మిగిలిన ఐదుమందిని త్వరలోనే కేటాయించనున్నారు.