: పాక్ బంకర్లను ధ్వంసం చేసిన భారత ఆర్మీ


జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ బంకర్లను భారత సైన్యం పేల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ వీడియోను గత నెలలో విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో పాక్ బంకర్లను వరుసగా పేల్చేస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కాగా, ఇద్దరు భారత జవాన్లను పాకిస్థాన్ సైన్యం ఇటీవల దారుణంగా హతమార్చిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో బయటికి రావడం గమనార్హం. 

  • Loading...

More Telugu News