: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొనే భారత జట్టు ఖరారు... యువీకి ప్లేస్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న జట్టులో యువరాజ్ సింగ్ స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో విశేషంగా రాణించిన, కేదార్ జాదవ్ తో పాటు మనీష్ పాండే కూడా భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
కాగా, 15 మంది సభ్యులు గల టీమిండియా వివరాల్లోకి వెళ్తే... కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హార్డిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ పై మంచి ట్రాక్ రికార్డు ఉన్న యువీపై నమ్మకముంచిన సెలెక్టర్లు, కేదార్ జాదవ్, మనిష్ పాండే ఫాంపై నమ్మకముంచారు.