: కేజ్రీవాల్ పై ఆరోపణలను నిగ్గు తేల్చండి: విచారణకు గవర్నర్ ఆదేశం


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లంచం తీసుకున్నారని మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల్లో నిగ్గు తేల్చాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యేంద్రజైన్ నుంచి 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలు కూడా కాసేపటి క్రితం అవినీతి నిరోధక శాఖకు సమర్పించారు. దీంతో గవర్నర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ చేసి, కేవలం ఏడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు పని ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News