: కుంతల రాజ్యంపై మనసు పారేసుకుని టూ బెడ్ రూం ఫ్లాట్ కోసం ఏజంట్లను వెతుకుతున్న రిషి కపూర్!


రిలీజైన ఓ వారం తరువాత 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాన్ని వీక్షించిన వెటరన్ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ రాజమౌళి టీమ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. నిన్న సాయంత్రం సినిమాకు వెళ్లిన ఆయన, ఇంటర్వెల్ సమయంలో ఓ ట్వీట్ పెడుతూ, "బాహుబలి-2ను ఇప్పుడు చూస్తున్నాను. విశ్రాంతి పడింది. సినిమా గురించి మళ్లీ మాట్లాడతాను. ఈ సినిమా ఎక్కడ షూట్ చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నా. అక్కడ నాకో 2 బెడ్ రూం ఫ్లాట్ కావాలి. ఎవరైనా ఏజంట్ ఉన్నారా?" అని ట్వీట్ చేశారు.

ఆపై రాత్రి సినిమా చూసిన తరువాత ట్వీట్ పెడుతూ, భారత సినిమా రంగానికి పండగొచ్చిందని, ఈ సినిమా వసూళ్లను చేరేందుకు మిగతా హీరోలు ఎంతో కృషి చేయాల్సి వుంటుందని అన్నారు. కాగా, రిషి కపూర్ బ్యాడ్ లక్. ఆయన మనసు పారేసుకున్న కుంతల రాజ్యం మొత్తం వీఎఫ్ఎక్స్ లో సృష్టించబడినదే. ఆయనకు అక్కడ 2 బెడ్ రూం ఫ్లాట్ దొరికే అవకాశం లేదని రిషి కపూర్ కు నెటిజన్లు సమాధానాలు ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News