: మా ధర్మం కోసం మేము ఎవర్నైనా చంపేస్తాం: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు


తమ ధర్మం కోసం అడ్డొచ్చిన వారిని ఎవరినైనా సరే చంపేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోహత్య చేసే ఎవరినైనా చంపేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, గోవులో 33,000 మంది దేవతలు ఉన్నారని భగవద్గీత చెబుతుందని అన్నారు. తమ తల్లిని ఎవరైనా చంపేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు. చట్టాలు వేరే పనుల్లో బిజీగా ఉన్నాయని, అందుకే గో సంరక్షణను తాము చేతుల్లోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అలాగని తాము తీవ్రవాదులం కాదని ఆయన చెప్పారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లే... ధర్మ పరిరక్షణకు ఆయుధం పట్టారని, తమ పవిత్ర గ్రంధాలు కూడా ధర్మ పరిరక్షణకు ఇతరులను చంపడం నేరం కాదని చెబుతున్నాయని ఆయన చెప్పారు. అందుకే హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ఇతరులను చంపుతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News