: ‘బాహుబలి’ వార్ సీక్వెన్స్ చేసేటప్పుడు చాలా శ్రమపడాల్సి వచ్చింది: సినిమాటోగ్రాఫర్ సెంథిల్
‘బాహుబలి’ రెండు పార్ట్స్ లో వార్ సీక్వెన్స్ చేసేటప్పుడు చాలా శ్రమపడాల్సి వచ్చిందని సినిమాటో గ్రాఫర్ సెంథిల్ చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాహుబలి-1లో కాళకేయ, బాహుబలి-2లో భల్లాలదేవతో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఎండల్లో పని చేయాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చిందని అన్నారు.
‘బాహుబలి’ రెండు పార్ట్స్ షూటింగ్స్ జరిగినన్ని రోజులు ఇంట్లో నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరి వెళితే సాయంత్రం ఇంటికి ఎప్పుడొస్తామో తెలిసేది కాదని, ఎప్పుడు పేకప్ చెబుతారో ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. అవంతిక పాత్ర అనగానే తనకు వాటర్ ఫాల్స్ సీన్, భల్లాల దేవ క్యారెక్టర్ చెప్పగానే క్రూరత్వం, ‘బాహుబలి’ అనగానే సెకండ్ పార్ట్ లో ‘సాహో’ ఇంట్రడక్షన్ సీన్ తనకు గుర్తుకువస్తాయని సెంథిల్ చెప్పుకొచ్చారు.