: సమంతా! నాగచైతన్య కూడా నాకు మెసేజ్‌ చేశాడు!: నటుడు దుల్కర్‌


మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్ తెలుగులో ‘ఓకే బంగారం’, ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఆయనకు నిన్న తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. తన భార్య‌ ఆడ‌పిల్లకు జ‌న్మ‌నిచ్చింద‌ని, త‌న‌ కల నెరవేరిందని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఆయ‌న‌కు ప‌లువురు నటులు శుభాకాంక్ష‌లు తెలిపారు. చెన్నై బ్యూటీ స‌మంత కూడా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌పై స్పందించిన‌ దుల్కర్... సమంత‌కు థ్యాంక్స్ చెప్పాడు. నాగ‌చైత‌న్య కూడా త‌న‌కు మెసేజ్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపాడ‌ని ఆయ‌న అన్నాడు. సమంత తిరిగి స్పందించి థ్యాంక్స్ అని పేర్కొంది. ఈ ఆస‌క్తిక‌ర సంభాష‌ణ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

  • Loading...

More Telugu News