: 12 మంది ఇంజినీర్లపై కేసులు... సస్పెన్షన్‌ వేటు వేసిన జీహెచ్ఎంసీ


గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని నాలాల పూడికతీతలో రూ.1.10 కోట్ల మేర అవినీతి జ‌రిగిన‌ట్లు ప‌లు ఆరోపణలు వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది ఇంజినీర్లను నిన్న సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయ‌గా, వారిని స‌స్పెండ్‌ చేస్తూ ఈ రోజు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జ‌నార్ద‌న్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈ వ్యవహారంపై గ‌తంలోనూ 18 మంది గుత్తేదార్లను పోలీసులు అరెస్టుచేసి కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కేసులు నమోదు కావడంతో సస్పెండైన 12 మంది ఇంజనీర్లలో ప్రేరణ, పాపమ్మ, కామేశ్వరి, నాయుడు, సంతోష్‌, అశోక్‌, మోహన్‌రావు, జమీల్‌షేక్‌, వశీధర్‌, శంకర్‌, శ్రీనివాస్‌, లాల్‌సింగ్‌లు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News