: హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెట్టడానికి దగ్గరపడిన ముహూర్తం!


హైదరాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో రైల్ ప్రారంభోత్స‌వం ఎన్నోసార్లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. గ‌త రెండు, మూడేళ్లుగా 'అదిగో ప్రారంభిస్తాం.. ఇదిగో ప్రారంభిస్తాం' అని చెబుతూ వ‌స్తోన్న మెట్రో అధికారులు ఇంత‌వ‌ర‌కు ఆ పని చేయ‌లేదు. ఈ అంశంపై తాజాగా స్పందించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప‌లు విష‌యాలు తెలిపారు. దాని ప్ర‌కారం మెట్రో రైలు ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామని, ఫస్ట్ కారిడార్ లో మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు రైల్ నడుస్తుందని ఆయ‌న అన్నారు. ఇందుకు సంబంధించిన తేదీని మాత్రం ప్రభుత్వమే ఫైనల్ చేస్తుందని చెప్పారు.

మెట్రో రైలు ప్రారంభమైతే నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయ‌ని అన్నారు. తాము త్వ‌ర‌లోనే ఇంటర్‌మోడల్ కనెక్టివిటీని ప్రారంభిస్తామ‌ని, ప్రయాణికులు రోడ్డు దాటడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. న‌గ‌రంలో బస్ బేస్, ఆటో బేస్, వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు సైతం ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News