: నేను బాగానే ఉన్నాను.. ఎవ్వరూ దిగులు చెందొద్దు: నటి ఖుష్బూ


ప్రముఖ సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ నివాసంలో బాంబు ఉంద‌ని, ఈ రోజు మ‌ధ్యాహ్నం ఓ బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఖుష్బూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో బాంబు, డాగ్ స్క్వాడ్ తో వ‌చ్చి, అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీనిపై కంగారు ప‌డిపోతున్న త‌న అభిమానుల‌కు ఖుష్బూ ఓ ట్వీట్ ద్వారా త‌న క్షేమ స‌మాచారం తెలిపారు. తాను బాగానే ఉన్నాన‌ని, త‌న‌కేం కాలేద‌ని అందులో పేర్కొన్నారు. త‌న అభిమానులు ఎవ్వ‌రూ దిగులు చెంద‌వ‌ద్ద‌ని ఆమె అన్నారు. 

  • Loading...

More Telugu News