: కేసీఆర్‌ పాలన ‘తెలంగాణ వద్దు- ఉమ్మడి ఏపీ ముద్దు’ అనే విధంగా ఉంది: పొన్నం ప్రభాకర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన ‘తెలంగాణ వద్దు- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముద్దు’ అనే విధంగా ప్లకార్డులు పట్టుకొని ప్రజలు నిరసనలు తెలిపే పరిస్థితి ఉంద‌ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవస్థను రద్దుచేస్తానని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మాట‌పై నిల‌బ‌డ‌కుండా ఒప్పంద ఉద్యోగాలకు జీవోలు ఇస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

 పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం ఇటీవ‌ల జారీ చేసిన జీవోల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. మ‌రోవైపు ప్ర‌భుత్వాసుప‌త్రుల ప‌రిస్థితులు అధ్వానంగా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఆశా కార్యకర్తలు పోరాడి వేతనాల పెంపును సాధించార‌ని, అదేం కేసీఆర్‌ గొప్ప కాదని ఆయ‌న అన్నారు. మహిళల వేధింపుల్లో తెలంగాణ‌ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్ర ప‌రిస్థితి ఈ విధంగా ఉంద‌ని ఆయ‌న విమర్శించారు.

  • Loading...

More Telugu News