: వారి నమ్మకం, కృషివల్లే నాకు ఈ అవార్డు వచ్చింది: కళాతపస్వి కె.విశ్వనాథ్
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మూడు రోజుల క్రితం భారత సినీ పరిశ్రమలోని అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో సినీ విమర్శకుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ... ఈ సందర్భంగా తన నిర్మాతలు, నటీనటులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎంతోమంది సినీ నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకం, నటీనటుల కృషివల్లే తనకు ఈ అవార్డు దక్కిందని ఆయన చెప్పారు. ఈ అవార్డు వచ్చినప్పటికీ తాను ఎప్పటికీ విశ్వనాథ్‌లానే ఉంటానని ఆయన భావోద్వేగపూరితంగా చెప్పారు. తాను మళ్లీ సినిమాలు తీసేందుకు తన వయసు సహకరించడం లేదని అన్నారు.