: సినీ నటి ఖుష్బూ నివాసానికి బాంబు బెదిరింపు


ప్రముఖ సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ నివాసంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. తమిళనాడులోని ఖుష్బూ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకురాలు ఫోన్ చేసింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఖుష్బూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాంబు, డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె నివాసం, ఆ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే అది బెదిరింపు ఫోన్ కాల్ మాత్రమేనని గుర్తించారు...దీంతో ఖుష్బూకు బాంబు అంటూ చేసిన కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News