: బద్రీనాథుడ్ని దర్శించుకుని, పూజలు నిర్వహించిన రాష్ట్రపతి


బద్రీనాథ్ ఆలయాన్ని నేడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సందర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత బద్రీనాథుడ్ని ఆయన దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, గవర్నర్ కేకే పాల్ ఉన్నారు. ఆరు నెలల శీతాకాలం విరామం అనంతరం చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది. అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి తెరుచుకోగా, ఏప్రిల్ 3న కేదార్ నాథ్ ఆలయాన్ని తెరిచారు. చివరిదైన బద్రీనాథ్ నేడు తెరుచుకుంది.

  • Loading...

More Telugu News