: మురికివాడలో రోడ్లు ఊడ్చిన ముఖ్యమంత్రి యోగి


ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చీపురు పట్టి, రోడ్డు ఊడ్చారు. లక్నోలోని ఓ మురికివాడలో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛతపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, రామ్ మోహన్ భాగ్ ప్రాంతంలో ఉన్న ఓ టాయ్ లెట్ ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న వర్కర్లకు శుభ్రత గురించి వివరించారు. స్వచ్ఛ సర్వేక్షన్-2017లో యూపీ నగరాలు బాగా వెనుకబడి ఉన్నాయి. టాప్ 100 స్వచ్ఛ నగరాల్లో యూపీ నుంచి కేవలం ఒక సిటీ మాత్రేమే చోటు సంపాదించుకుంది. దీంతో, ప్రజల్లో శుభ్రత గురించి చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన యోగి... స్వయంగా రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News