: ఎంసెట్-2017లో విజయవాడ ఫ్లాప్ షో!
విజయవాడ అంటేనే విద్యకు నిలయం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యకు బెజవాడ కేరాఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదు. ఇంక ఎంసెట్ విషయానికి వస్తే టాప్ టెన్ ర్యాంకుల్లో విజయవాడదే ఎక్కువ సందడి. అలాంటి విద్యానిలయం విజయవాడకు ఎంసెట్-2017 పీడకలను మిగిల్చింది. నిన్న విడుదలైన ఎంసెట్ ఫలితాలు బెజవాడకు నిరాశను మిగిల్చాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో ఈ సారి విజయవాడకు ఒక్క స్థానం కూడా లభించలేదు. అయితే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా మాత్రం మెడిసిన్ లో ఫస్ట్ ర్యాంక్, ఇంజినీరింగ్ విభాగంలో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఇంజినీరింగ్ టాప్ టెన్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు నిలిచారు.