: ఎంతో గర్వపడాలి.. ఈ ప్రయోగం భారత్ ను దక్షిణాసియాలో నాయకత్వ స్థానంలో నిలిపింది: మోదీ
ఈ రోజు ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. జీఎస్ఎల్వీ-ఎఫ్09 ద్వారా అంతరిక్షంలోకి జీశాట్-9 ఉపగ్రహాన్ని ప్రవేశబెట్టి ఇస్రో సాధించిన విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ... దక్షిణాసియాకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తాను కాసేపట్లో దక్షిణాసియా నాయకులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతానని తెలిపారు. ఈ ప్రయోగం భారత్ ను దక్షిణాసియాలో నాయకత్వ స్థానంలో నిలిపిందని మోదీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు భారత్ గర్వించే సేవలను అందిస్తున్నారని ఆయన కొనియాడారు.
I congratulate the team of scientists who worked hard for the successful launch of South Asia Satellite. We are very proud of them. @isro
— Narendra Modi (@narendramodi) May 5, 2017