: ఢిల్లీ మెట్రో రైలులో గొడవ... యువకులతో కొట్లాటకు సై అంటూ షర్ట్ విప్పేసిన మహిళ!
ఢిల్లీ మెట్రో రైలులో చోటుచేసుకున్న ఓ గొడవ కారణంగా ఓ మహిళ తన షర్టు విప్పేసి దమ్ముంటే తనతో కొట్లాడమని సవాలు విసిరింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోయిడాలో నల్లజాతీయులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఇటీవలే ఆఫ్రికన్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మరోసారి కలకలం రేపేలా ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు మెట్రో రైలులో వెళ్తుండగా తోటి ప్రయాణికులు వారితో వాదనకు దిగారు.
ఆ రైలులో యువకులు అధికంగా ఉన్నారు. ఆ ఆఫ్రికన్ మహిళలు ఇద్దరూ కూడా వారితో వాగ్వాదానికి దిగి, రెచ్చిపోయారు. కొద్ది సేపటికి అందులో ఓ మహిళ సీటులో కూర్చుంది. అయితే, వారిద్దరినీ బయటకు తోసేయాలని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో ఓ మహిళ తన షర్ట్ విప్పేసి 'కొట్లాటకు రండి' అంటూ యువకులకు సవాలు విసిరింది. దీంతో ప్రయాణికులంతా షాకయ్యారు. ప్రయాణికుల్లో కొందరు ఆ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది.