: తెలంగాణలో బ్రాహ్మణ ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం
బ్రాహ్మణ ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జూన్ 5న బ్రాహ్మణ సదన్ కు శంకుస్థాపన చేయనున్నామని, ఈ నెల 9న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్ సైట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. సరస్వతి విద్యా ప్రశస్తి పథకం కింద టాపర్లుగా నిలిచే బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించనున్నామన్నారు. అంతేకాకుండా, బ్రాహ్మణ విద్యార్థులకు విదేశాల్లో విద్య కోసం స్వామి వివేకానంద ఓవర్సీస్ పథకం, ‘లక్ష్య’ పేరుతో ఉన్నత చదువులకు శిక్షణ పొందే బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని రమణాచారి తెలిపారు.